Wednesday, May 15, 2024
- Advertisement -

బిగ్ బాస్ టాప్ లో ఇద్దరు మాత్రమే.. టైటిల్ ఎవరికి ?

- Advertisement -

బిగ్ బాస్ షో ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు ఇంటి సభ్యులు.. శ్రీముఖి, అలీ, రాహుల్, వరుణ్, బాబా భాస్కర్. వీరిలో ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రసుతం టాఫ్ ఫైవ్ లో రాహుల్ ముందు స్థాయిలో ఉన్నాడని తెలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా అతనే నెంబర్ వన్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మిగిత కంటెస్టెంట్లు తెలివిగా ఆడుతూ ఓట్లు సంపాదించుకుంటున్నారు. ఇక రాహుల్ తర్వాత అధ్యికత్యను ప్రదర్శితూ రేసులో ఉన్న సెలబ్రిటీ శ్రీముఖి. మల్టీ టాలెంట్ ఉన్న ఈ యాంకర్ తనదైన శైలిలో రాణిస్తోంది. ఆమె పట్ల కూడా ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక బాబా భాస్కర్ కు గేమ్ చాలా డిఫరెంట్ గా ఉంది. అతనికి తెలుగు తో పాటు తమిళంలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉండటంతో అతనికి అక్కడ నుంచి కూడా ఓట్లు పడుతున్నాయి.

ఎప్పుడు నవ్వుతూ తన పక్కవాళ్లను నవ్వించడం బాబాకు బాగా అలవాటు. అదే ప్రేక్షకులకి బాగా నచ్చింది. ఇక ఓ స్థాయిలో టైటిల్ రేసులో ముందు వరసలో ఉన్న అలీ.. అనుకోకుండా వెనకపడ్డాడు. దాంతో వీరి ముగ్గిరితో పోలీస్తే అలీకి ఓట్లు తక్కువగానే పడుతున్నాయి అని చెప్పాలి. ఇక వరణ్ సందేశ్ కూడా టైటిల్ కోసం తన వంతు కృషి చేస్తున్నాడు. వరుణ్ కి ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతున్నారు. అందుకే ఆ రకంగా వరుణ్ కి బాగా ఓట్లు పడే ఛాన్స్ ఉంది.

సో ఎవరికి వారు తమ పోరులో దూసుకెళ్తున్నారు. విజయం పట్ల మాత్రం రాహుల్, శ్రీముఖి నిలిచే ఛాన్స్ ఉందని నెటిజన్లు అంటున్నారు. ఇక ఈ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. ఆయన చేతుల మీదగా బిగ్ బాస్ టైటిల్ ను విన్నర్ కు అందజేయనున్నారు. ఇక గత రెండో సీజన్ కు వెంకటేష్ చీఫ్ గెస్ట్ గా హాజరైన విషయం తెలిసిందే.

ఇక బిగ్‌బాస్ సెలబ్రిటీలకు ఓటింగ్ కోసం

వరుణ్ సందేశ్‌.. 8466 996 714

రాహుల్ సిప్లిగంజ్‌కు 8466 996 706

శ్రీముఖి .. 8466 996 713

భాబా భాస్కర్‌ 8466 996 708

అలీ రెజా‌కు 8466 996 711

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -