Sunday, April 28, 2024
- Advertisement -

శ్రీముఖితో రాహుల్ సిప్లిగంజ్.. పోస్ట్ వైరల్..!

- Advertisement -

ఇటివలే తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ ముగిసింది. ఈ షోలో రాహుల్ విన్నర్ కాగా.. శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. అయితే ఈ బిగ్ బాస్ వల్ల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాహుల్, పునర్నవి ల మధ్య అనుబంధం ఎంతో రక్తికట్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి మధ్య లవ్ ఉందని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇలా రకరకల వార్తలు వస్తునే ఉన్నాయి.

ఇక రాహుల్, శ్రీముఖి మధ్య పోరు కూడా బాగా హైలైట్ అయింది. వీరిద్దరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు కొట్టుకుంటునే ఉన్నారు. వాదపవాదాలతో బిగ్ బాస్ హౌస్ ని వేడెక్కించారు. ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకున్నారు. ఒక దశలలో ఇద్దరి మధ్య మనస్పర్దలు తారాస్థాయికి వెళ్లాయి. బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు వారి మధ్య వివాదాలకు కారణం అయ్యాయి.

అయితే.. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతోంది. “అసలు రిలేషన్ ఇప్పుడే మొదలైంది” అంటూ రాహుల్ పోస్టు చేసిన సెల్ఫీ ఫొటోకు మంచి స్పందన వస్తోంది. శ్రీముఖి కూడా ఇదే ఫోటోను పోస్ట్ చేసింది. దినీకి ” గతం గతః” అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. వీరిద్దరు బిగ్ బాస్ హౌస్ లో వివాదాలను అక్కడే వదిలేసి వచ్చినట్లు తాజా ఫోటో చెబుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -