Sunday, May 26, 2024
- Advertisement -

రజనీ న్యూ లుక్ అదిరింది!

- Advertisement -

కథానాయకులు ఎంతమంది ఉన్న సూపర్ స్టార్ రజనీకి ఉన్నా క్రేజ్ డిఫరేంట్. డైలాగ్ చెప్పిన, డాన్స్ వేసిన అతని స్టైలే వేరు. తమిళంలోనే కాక, తెలుగు, హింది, కన్నడం, మళయాళం పలు భాషల్లో రజనీకి అభిమానులు ఉన్నాయి. రజనీ సినిమా రిలీజ్ అయిందంటే రికార్డులు సృష్టించాల్సిందే.

ఐతే ప్రస్తుతం రజనీ కబాలి షూటింగ్‍లో బిజీగా ఉన్నాడు. ఇప్పటి వరకు ఎప్పుడు చూడని విధంగా రజనీ ఈ సినిమాలో కనిపిస్తాడు అని కబాలి టీమ్ చెపుతుంది. ఈ సినిమాలో రజనీ మాఫియా డాన్‍గా కనిపించబోతున్నాడు. అందుకోసం హెయిర్ స్టైల్ – గెడ్డంతో కొత్త గెటప్‍లో కనిపించనున్నాడు.

అదే కాకుండా చేతికి టాటూస్ వేయించి మరింత స్టైలిష్‍గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూసిన రజనీ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. పోస్టర్లోనే రజినీ ఈ విధంగా ఉన్నడంటే సినిమాలో ఇంక ఏ రేంజ్‍లో ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ లుక్‍తో సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సమ్మర్‍లో రిలీజ్‍కు ప్లాన్ చేస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -