Saturday, April 27, 2024
- Advertisement -

స్పైడర్ చూసి రామ్ చరణ్ ఏమన్నారో తెలుసా..?

- Advertisement -

స్పైడర్ సినిమా రిలీజ్ అయిన మొదట రోజే కొందరు కావాలనే నెగిటివ్ టాక్ ను ప్రచారం చేశారు. ఈ విషయంపై మహేష్ బాబు ఫ్యాన్స్.. సినిమా మరి బ్రహ్మోత్సవం లా అయితే లేదు.. ఖచ్చితంగా చూసే సినిమా.. అందుకే మొదటి రోజు ఈ సినిమాకి 51 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని.. కావాలనే ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం చెస్తున్నారు మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాపై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీ కాంత్ ఈ సినిమా చూసి.. అద్భుతంగా ఉందని.. మహేష్ నటన సూపర్ అని.. దర్శకుడు సినిమాని బాగా తెరకెక్కించాడని ఆయన స్పైడర్ సినిమాని ప్రశంసించారు. ఇప్పుడు టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా స్పైడర్ సినిమా చూసినట్లు టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. అయితే మహేష్ కి, రామ్ చరణ్ కి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు ఖాళీ ఉన్న సమయం లో కలుసుకుంటూ ఉంటారు.

అందుకే రామ్ చరణ్ స్పైడర్ సినిమా చూసాడట. సినిమాలో మహేష్ నటన గురించి ఎంత చెప్పిన తక్కువే అని అన్నట్లు తెలుస్తోంది. ఇక ఎస్ జే సూర్య విలన్ గా చాలా బాగా చేశారని.. దర్శకుడు ఈ సినిమాని నడిపించిన విధానం చాలా బాగుందని ఆయన అన్నారు. ఏది ఏమైన మొదట నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న స్పైడర్ రాను రాను మంచి ఊపు అందుకుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -