- Advertisement -

రామ్ చరణ్ ‘పెద్ది’..క్లాసీ పోస్టర్‌!

- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తూ ఒక అద్భుతమైన పోస్టర్‌ను విడుదల చేసింది.

‘పెద్ది’ చిత్ర ట్రైలర్‌ను మే 20న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో పాటు విడుదల చేసిన పోస్టర్‌లో రామ్ చరణ్ చాలా క్లాసీగా, సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తున్నారు. చరణ్ లుక్ చూస్తుంటే ఈ సినిమాలో ఆయన ఒక వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నారని స్పష్టమవుతోంది.

ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా పాటలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. దీని కోసం చరణ్ ప్రత్యేకంగా శారీరక శిక్షణ కూడా తీసుకున్నారు.

చాలా కాలం తర్వాత రామ్ చరణ్ నుండి ఒక పక్కా లోకల్ అండ్ ఎమోషనల్ సబ్జెక్ట్ వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ట్రైలర్ విడుదల తేదీ ఖరారు కావడంతో సోషల్ మీడియాలో “Peddi Trailer” అనే హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మే 20న మెగా పవర్ హౌస్ విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఆశిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -