Thursday, April 18, 2024
- Advertisement -

అనసూయపై బూతులు.. రష్మీ గుడ్..!

- Advertisement -

బుల్లితెరపై యాంకర్ రష్మీ, అనసూయ లకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వీరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. వీరు ఏదో ఒక పోస్ట్ చేయడం, వాటికి నెటిజన్స్ ఏదో ఒక వల్గర్ కామెంట్ చేయడం మళ్లీ దానిపై పెద్ద రచ్చ చేయడం లాంటివి తరుచూగా జరుగుతునే ఉంటాయి. తాజాగా ఓ నెటిజన్ రష్మీని పొగుడుతూ.. అనసూయను తిట్టాడు.

ఈ ట్వీట్‌కు రష్మీ ఇచ్చిన రిప్లై అందర్నీ ఆకట్టుకుంటోంది. విషయంలోకి వెళ్తే.. సామాజిక సమస్యలపైనా రష్మీ రియాక్ట్ అవుతూ ఉంటుంది. నెటిజన్స్ వేసే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటుంది. ఎవరైనా ఘాటుగా స్పందిస్తే అదే రీతిలో కౌంటర్ కూడా వేస్తుంటుంది. అనసూయ కూడా హాట్ హాట్ ఫోటో షూట్‌లతో ఫోస్టులు చేస్తూ ఉంటుంది. ఎవరైన తనపై కామెంట్ చేస్తే వారిని బ్లాక్ చేసేస్తుంది.

రష్మీ మాత్రం వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తుంది. రష్మీ తెలుగమ్మాయి కాకపోయినా.. తెలుగు ఆచారాలు, సంప్రదాయాలు, పద్దతులను పాటిస్తూ ఉంటుంది. రష్మీ చేసిన ఉగాది పోస్ట్‌కు ఓ నెటిజన్ స్పందిస్తూ.. సంప్రదాయాలను పాటించే మీరంటా నాకు చాలా గౌరవం, అయితే అనసూయ మాత్రం క్రిస్మస్‌కు విష్ చేస్తుంది. ఉగాది మాత్రం చేయదంటూ అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ కామెంట్‌కు రష్మీ రిప్లై ఇస్తూ.. సర్ మీ భాష.. మీ అభిప్రాయాన్ని చెప్పే హక్కు మీకుంది కానీ ఇలాంటి భాషను వాడకూడదంటూ సూచించింది. దీనిబట్టి రష్మీ సందర్భం బట్టి మాట్లాడుతుందని అర్ధం అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -