- Advertisement -
ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘గం గం గణేశా’. తన కెరీర్‌లో తొలిసారి డిఫరెంట్ మూవీతో వస్తుండగా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. గం గం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు నటి రష్మిక మందన్న. రెండోసారి ఆనంద్ సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చారు రష్మికా.
బేబి దర్శకుడు సాయి రాజేష్ గురించి మాట్లాడుతూ..ఆ సినిమా చూసాక మీతో సినిమా చేయాలని అనుకున్నాను. అలాంటి సినిమా చేయడం అంత ఈజీ కాదు అని తతెలిపింది. మీ హార్డ్ వర్క్, డెడికేషన్ నాకు తెలుసు. మొదటిసారి బేబీ సినిమా చూసినప్పుడు ఏడ్చేసాను అని చెప్పుకొచ్చింది.
ఒక నటిగా ఆ సినిమా చూసాక సాయి రాజేష్ తో ఒక సినిమా చేయాలి, ఒక మెంటల్ క్యారెక్టర్ చేయాలనిపించింది మీ డైరెక్షన్ లో అని చెప్పి అందరిలో జోష్ నింపింది. ఇక ప్రస్తుతం రష్మికా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.