- Advertisement -

రష్మిక ‘మైసా’ అప్‌డేట్!

- Advertisement -

నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న చిత్రం మైసా. ఈ సినిమా షూటింగ్ కేరళలోని కొచ్చిలో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌కు సంబంధించిన కొన్ని బిహైండ్ ది సీన్స్ (BTS) చిత్రాలను పంచుకుంటూ, తనకున్న ఒక భయం గురించి ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

రష్మికకు చిన్నప్పటి నుంచి ఎత్తులంటే విపరీతమైన భయం . అయితే ‘మైసా’ సినిమా కోసం ఆమె ఒక ఎత్తైన ప్రదేశంలో సీక్వెన్స్‌ను షూట్ చేయాల్సి వచ్చింది.
నాకు ఎత్తులంటే చాలా భయం. కానీ ఈ సినిమా కోసం, ఆ పాత్ర కోసం నా భయాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను. కొచ్చి షెడ్యూల్‌లో ఆ ఎత్తైన ప్రదేశంలో షూటింగ్ చేయడం ఒక సవాలుగా అనిపించింది అని రష్మిక పేర్కొంది.

కొచ్చిలోని అందమైన లొకేషన్లలో షూటింగ్ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, అక్కడ దొరికే కేరళ భోజనాన్ని కూడా తాను బాగా ఆస్వాదిస్తున్నానని ఆమె తెలిపింది. తన భయాన్ని పక్కన పెట్టి మరీ షూటింగ్‌లో పాల్గొన్న రష్మికపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -