రవితేజ.. ప్రస్తుతం అనిల్ రావుపుడి డైరెక్షన్లో రాజా ది గ్రేట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సిమాకి సంబంధించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఇది పక్కన పేడితే.. ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో జై లవకుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
వచ్చే వారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ ప్రమోషన్ లో బిజీగా ఉంది. ఇలాంటి టైంలో ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్ లో హల్ చల్ చేస్తోంది. అసలు ఈ జైలవకుశ స్టోరీ రవితేజను దృష్టిలో పెట్టుకొని రాసిందంట. విషయంలోకి వెళ్తే.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫెయిల్ తో బాధపడ్డ బాబీ.. మూడు నెలలు కూర్చొని జై లవకుశ కథ రాసుకున్నారు. ఆ కథని మొదట రవితేజకి వినిపించినట్లు తెలిసింది. కథ విన్న రవితేజ కొన్ని మార్పులు సూచించారట. మూడు పాత్రలకు బదులు, రెండు పాత్రలు చేయమని చెప్పారని సమాచారం.
కథలో మార్పు చేయడం ఇష్టం లేని బాబీ అదే కథను ఎన్టీఆర్ కి వినిపించారట. కొత్త కథ కోసం గాలిస్తున్న సమయంలో ఈ స్టోరీ బాగా నచ్చి ఒకే అన్నారని ఫిలిం నగర్ వర్గాల వారు చెబుతున్నారు. ఆ కథ కోసం ఎన్టీఆర్ గట్టిగా శ్రమించి.. టీజర్, ట్రైలర్ లతో అంచనాలను పెంచుతున్నారు. మరి సినిమా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.