నాగ చైతన్య, సమంతల పెళ్లి.. కొద్ది అతిథుల మధ్య అట్టహాసంగా జరిగింది. దగ్గుబాటి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీల మధ్య చైసామ్ లను ఒక్కటయ్యారు. అంగరంగ వైభవంగా ఈ పెళ్లి వేడుక జరిగింది. చాలా కొద్దిమందికి అంటే వంద మందికి మాత్రమే ఈ పెళ్లికి ఆహ్వానం అందింది. దీంతో సినీ దిగ్గజాలెందరో ఆహ్వానాలు అందుకోలేకపోయారు.
ఆహ్వానం అందుకున్న కొద్దిమందిలో ప్రముఖ గాయని చిన్మయి, హాస్యనటుడు వెన్నెల కిషోర్ ఉండడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే దీని వెనుక చాలా బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు. సమంత మొదటి సినిమా ‘ఏం మాయ చేసావే’ సినిమాతో పెద్ద హిట్ అందుకోవడమే కాదు ఆ సినిమాలో తన క్యారక్టర్ వాయిస్ కి కూడా చాలా పేరొచ్చింది. సమంత కు వాయిస్ ఓవర్ చెప్పింది చిన్మయి. తెరమీద సమంత ఆందానికి ప్రేక్షకుల ఫిదా అయితే తన అందమైన గొంతుకతో సమంతాకి ఇంకా కొంచెం ఎక్కువ క్రేజ్ తెచ్చిపెట్టింది మాత్రం తెరవెనుక చిన్మయి వాయిస్. దీంతో వీరిద్దరి సినిమా ప్రయాణం మెల్లగా ఇద్దరి మధ్య బలమైన స్నేహాన్ని పెంచిందట. సమంత ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ గా సక్సెస్ కావడానికి సమంత నటనతో పాటు చిన్మయి చెప్పిన డబ్బింగ్ కూడా ఒక కారణం అనడంలో ఆశ్చర్యం లేదు. అయితే సమంత ఇప్పుడు డబ్బింగ్ చెప్పుకునే స్థాయిలో ఉన్నా చిన్మయి మాత్రమే ఆమెకు డబ్బింగ్ చెప్తుంది.
తన సక్సెస్ కు ఇంతా వెన్నంటి నిలిచిన చిన్మయినీ తన కుటుంబ సభ్యురాలిగా భావించి తనకు పెళ్లి ఆహ్వానాన్ని ఇచ్చింది సమంత. వెన్నెల కిషోర్ నటనపై గల మక్కువతో అమెరికా నుండి ఇండియాకి తిరిగి వచ్చేశారు. ఇప్పుడు ఒకస్థాయి కమెడియన్ గా నిలదొక్కుకున్నాడు. ఇతడు సమంత, చైతూ ఇద్దరికీ కూడా మంచి స్నేహితుడు. దీని కారణంగానే వెన్నెల కిషోర్ కి కూడా ఆహ్వానం అందింది. దీంతో చిన్మయి, వెన్నెల కిషోర్ లు అతికొద్ది మంది మాత్రమే వివాహ వేడుకలో పాల్గొనగలిగిన అరుదైన అవకాశం దక్కించుకున్నారు.