Monday, May 13, 2024
- Advertisement -

“సుబ్రమణ్యం ఫర్ సేల్”పై భారీ ఆశలు పెట్టుకున్న భామ

- Advertisement -

చూడటానికి ఇలియానాలా ఉండే హాట్ బ్యూటీ రెజీనా… కెరీర్ పరంగానూ గోవా బ్యూటీలాగే టాప్ రేంజ్ కు చేరుకోవాలని ఎంతోగానో ప్రయత్నాలు చేస్తుంది.

అప్ కమింగ్ హీరోలతో రోమాన్స్ చేస్తున్న ఈ భామ స్టార్ హీరోలను మాత్రం ఆకట్టుకోలేకపోతుంది. ఎంతసేపు చిన్న హీరోల సరసన నటించటానికే అవకాశాలు వస్తున్నాయి ఈ భామకు. త్వరలోనే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నది.

మెగా మేనల్లుడు  సాయిధరమ్ తేజ్ సరసన ‘పిల్లా నువ్వు లేని జీవితం’లో రోమాన్స్ చేసి సక్సెస్ సాదించిన ఈ భామ సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాపై ఎన్నో ఆశలను పెట్టుకుంది.

ఈ సినిమా మినహా ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో సినిమాలు ఏమి లేకపోవటంతో రెజీనా కెరీర్ కు ఈ సినిమా చాలా కీలకం అని, ఈ సినిమా రిజల్ట్ మీదే ఈ భామకెరీర్ ఆధారపడి ఉందని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఒక్కసారి క్రేజీ హీరోల సరసన నటించే చాన్స్ వస్తే తన కెరీర్ ఊపు అందుకుంటుందని కలలు కంటుంది రెజీనా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -