Thursday, May 16, 2024
- Advertisement -

జబర్దస్త్ షో నుంచి రోజా తప్పుకోవడానికి.. అసలు కారణం ఎవరంటే..?

- Advertisement -

ఒక్కప్పుడు హీరోయిన్ గా చేసి.. ప్రస్తుతం సినిమాలో ముఖ్యమైన పాత్రలు చేస్తూ.. రాజకీయాల్లో బిజీగా ఉంటునే.. బుల్లితెరపై కూడా చేస్తోంది నటి రోజా. అయితే రోజా జడ్జ్ గా చేస్తున్న జబర్దస్త్ కామెడీ షోపై చాలా రోజుల నుంచి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అలానే.. రోజాపై కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజకీయాలో మంచి స్థానంలో ఉండి.. ఇలాంటి షోస్ చేయడం ఏంటి అని సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే తాజాగా జబర్దస్త్ కామెడీ షో నటించడం ఇకపై మానేస్తానని అన్నారు నటి రోజా. ఈ షోలో చేయడంపై ఆమె మాట్లాడుతూ.. అందులో తాము కేవలం జడ్జీలు మాత్రమేనని.. స్కిట్ కు సంబంధించి.. తాము నవ్వినా నవ్వకపోయినా.. నవ్వినా క్లిప్పింగ్స్ ప్లే చేస్తారని అన్నారు. షోలో తాము ఎప్పుడు కూడా బూతు మాటలు మాట్లాడలేదని.. అయిన తాను అసలు బూతు డైలాగులు వాడనని చెప్పింది. బూతు డైలాగులు ఉపయోగిస్తే.. అందుకు సెన్సార్ బోర్డులు ఉన్నాయని అన్నారు. టెలికాస్ట్ అవుతున్న చానెల్ ని వదిలేసి.. తనను ఎందుకు అడుగుతున్నారో తనకు అర్ధం కావడం లేదని అన్నారు. జబర్దస్త్ మంచి షో అని.. ప్రతి ఒక్కరు చూసి నవ్వుకునే లా ఉంటుందని అన్నారు. ఇటివలే ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు రోజా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -