టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ 37వ పుట్టినరోజు సందర్భంగా రౌడీ జనార్ధన టీమ్ అభిమానులకు ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇచ్చింది. మూవీ నుంచి విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో విజయ్ దేవరకొండ మాస్, ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తూ అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేశారు.
తాజాగా విడుదలైన పోస్టర్‌లో విజయ్ వర్షంలో తడిసిన గెటప్‌లో చేతిలో గన్ పట్టుకుని కనిపించారు. పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్, సీరియస్ ఎక్స్‌ప్రెషన్‌తో ఆయన పాత్ర ఎంత తీవ్రంగా ఉండబోతోందో పోస్టర్‌నే చెప్పేస్తోంది. “ది బయోగ్రఫీ ఆఫ్ ఏ వుండెడ్ మ్యాన్” అనే ట్యాగ్‌లైన్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ఈ సినిమా గ్రామీణ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతోంది. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు ఇప్పటికే సమాచారం ఉంది. పోస్టర్‌లో ఆమె పాత్రకు సంబంధించిన హింట్ కూడా కనిపించిందని అభిమానులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. విజయ్–కీర్తి కాంబినేషన్‌పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
రౌడీ జనార్ధనచిత్రాన్ని 2026 డిసెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
