Sunday, May 4, 2025
- Advertisement -

ఉచితంగా చేసి.. నక్షత్రాలు చూసిన సాయి ధరమ్ తేజ్

- Advertisement -

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ చాలా మంచి మనసు అని పరిశ్రమలో చాలా మంది అంటూ ఉంటారు. అయితే ధరమ్ తేజ్ పెద్ద మనసుతో చేసిన్ ఓ ప్రయత్నం బెడిసికొట్టింది. ఇటివలే రిలీజ్ అయిన ‘నక్షత్రం’ ధరమ్ తేజ్ కు పెద్ద పంచే ఇచ్చింది. దర్శకుడు కృష్ణవంశీ మీద గౌరవంతో ఫ్రీగా ఈ సినిమా చేస్రే.. దాని వల్ల మంచి రాకపోగా చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు.

‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.. ‘సుప్రీమ్’ లాంటి హిట్లతో మంచి జోష్ లో ఉన్న తేజ్.. కృష్ణవంశీ అడిగితే.. ఆయన మీద ఉన్న గౌరవంతో ‘నక్షత్రం’లో చిన్న స్పేషల్ రోల్ చేశాడు. అయితే తేజు చిన్న పాత్ర కదా అని ఒప్పుకున్నాడు.. అయితే కృష్ణ వంశీ మాత్రం ఆ పాత్రను పెద్దది చేశాడు. తేజు క్రేజ్ను సినిమాకు వాడుకుందామని అనుకున్నాడో ఏమో.. దాన్ని మరింతగా పెంచాడట కృష్ణవంశీ. అయితే నక్షత్రం అనుకున్న టైంకి కంప్లీట్ అవ్వలేదు. దాంతో ఈ సినిమా కోసం తేజ్ ఎక్కువ రోజులు పని చేయాల్సి వచ్చింది. బడ్జెట్ సమస్యల వల్ల ఈ సినిమాకు తేజు అసలు పారితోషకమే తీసుకోలేదు.

షూటింగ్ లో పాల్గొన్న అన్ని రోజులు ఉచితంగా పని చేశాడు. పైసాల్ రాకున్న పేరు వస్తుందనుకున్న.. అదీ జరగలేదు. ఆల్రెడీ తిక్క.. విన్నర్ లాంటి డిజాస్టర్లతో వెనుకబడి ఉన్న సమయంలో ‘నక్షత్రం’ వచ్చి తేజును మరింతగా వెనక్కి లాగేసింది. ఈ మూవీలో తేజు చేసింది అతిథి పాత్రే అయినప్పటికీ.. ఈ ఫ్లాప్ ను కూడా అతడి ఖాతాలో వేసి.. ‘హ్యాట్రిక్ ఫ్లాప్’ హీరోగా అతడికి కిరీటం పెట్టేస్తున్నారు జనాలు. మొత్తానికి నక్షత్రం సినిమా తేజ్ కు నిజంగానే నక్షత్రాలు చూపించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -