Sunday, May 11, 2025
- Advertisement -

అర్జున్ రెడ్డి ని ఆకాశానికి ఎత్తేసిన సమంత

- Advertisement -

అర్జున్ రెడ్డి.. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్. నలుగురు ముచ్చటేస్తున్నారంటే.. ఖచ్చితంగా అది అర్జున్ రెడ్డి సినిమా గురించే. మొదటి నుంచి వివాదాల్లో నిలిచిన ఈ సినిమా.. రిలీజ్ తర్వాత రెట్టింపయ్యింది. మధ్యం సేవించి డాక్టర్ ఆపరేషన్ చేయడం, ముద్దులు పెట్టుకోవడం, పెళ్ళి కాకుండానే కడుపులు చేయించుకోవడం.. వల్గర్ సీన్స్ ఇలా.. ఒక్కటి కాదు కుటుంబ సభ్యులతో కలిసి అస్సలు సినిమాను చూడలేమని కొందరు విమర్శలు చేశారు.

కానీ ఈ సినిమాలో హీరోగా నటించిన అర్జున్ రెడ్డికి మాత్ర్రం మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఎలాంటి బ్యాక్ గ్రాండ్ సపోర్ట్ లేని.. విజయ్.. ఈ సినిమాతో ఎక్కడికో వెళ్లిపోయాడు. అయితే ఎన్ని విమర్శలులు వచ్చిన.. అదే రెంజ్ లో మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాని మెచ్చుకుంటున్నారు. రాంగోపాల వర్మ మాత్రం ఈ సినిమా సూపర్ అంటూ ట్వీట్ చేశాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్, సమంతలిద్దరూ ఈ సినిమాలో నటించిన విజయ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. మహేష్ బాబు కూడా ఈ సినిమాని, విజయ్ ని ఆకాశానికి ఎత్తాడు.

అయితే సమంతకు.. మాత్రం విజయ్ క్యారెక్టర్ తెగ నచ్చేసిందట. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో విజయ్ రాణిస్తున్న తీరు నచ్చిందని పొగడ్తలతో ముంచెత్తిందట. ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో విజయ్ పైన సమంత చేసిన వ్యాఖ్యలే హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాకుండా.. అర్జున్ రెడ్డి సరసన సమంత నటిస్తుందేమో అన్న చర్చ కూడా జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -