Tuesday, May 21, 2024
- Advertisement -

అసలు సమంతకి కోపమెందుకొచ్చిందీ..?

- Advertisement -

”ఆ మాట నేను చెబితే నన్ను చెప్పుతో కొడతారు. మాట్లాడేదానికి కొంచమైనా అర్థం ఉండాలి” అనేసిందిట సమంత. అసలు సమంతకి కోపమెందుకొచ్చిందీ..? మరీ చెప్పుతో కొట్టే మాట ఏమైఉంటుందీ? మరీ ఎక్కువగా ఆలోచించకండి. సమంతా ఆ మాటలన్నది సినిమాల హిట్ అవటానికీ తానొక్కదాన్నే కారణం కాదూ అని.

ఒక రకంగా సమంత చెప్పింది కూడా నిజమే. సినిమా అంటేనే టీం వర్క్ అందరూ కలిసి సరిగ్గా పని చేస్తేనే ఆ సినిమా హిట్ ఔతుంది. సినిమా ఫెయిల్యూర్ కి ఏ ఒక్కరో కారణం కాదు. అలాగే హిట్ అయినప్పుడూ,కలెక్షన్లు సాధించినప్పుడూ..ఆ క్రెడిట్ అంతా ఒక్కరి ఖాతాలో వేసేయడం కరెక్టు కాదుగా.

బ్రహ్మొత్సవం ఎంత ఇండస్ట్రీ డిజాస్టర్ అనిపించుకున్నా మిలియన్ డాలర్ల బిజినెస్ అమెరికాలో చేసింది. అయితే ఈ సినిమాతో కలిపి మొత్తం 1 మిలియన్ కలక్షన్లు సాధించిన సినిమాలు హీరోయిన్ సమంత ఖాతాలో లో తొమ్మిది ఉన్నట్లు. ఇక ఇప్పుడు “అ..ఆ” కూడా 1 మిలియన్ క్లబ్ లో చేరిపోయిందంటే.. ఆ నంబర్ రెండంకెల్లోకి మారుతుంది మొత్తం 10 అవుతుంది.

ఇక సమంతాని “ఓవర్సీస్ క్వీన్” అని పిలవచ్చంటారా?? అని అడిగితే.. “ఆమాట అంటే నన్ను చెప్పుతో కొడతారు నా ఒక్కదాని దా సినిమా అంతా ” అనేసింది. అసలు నిజాన్ని అర్థం చేసుకున్న సమంతా నిజానికి సరిగ్గానే చెప్పింది. అందుకే అలా సమాధానం చెప్పింది. ఒక సినిమా అంటే కేవలం ఏ ఒక్కరి కారనం వల్ల మాత్రమే అది విజయం సాధించదనీ ఆమె అర్థం చేసుకుంది. అంతే కాదు.. అమ్మడిని ఫెయిల్యూర్ లు చాలా కుదించేస్తాయ్ అని కూడా చెప్పుకొచ్చింది. అంటే 1 మిలియన్ డాలర్లు వచ్చిన సినిమాల్లో కొన్ని కమర్షియల్ హిట్లు కాదు కదా.. అందుకే అలా చెప్పిందనమాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -