నందమూరి బాలకృష్ణ నటించిన ‘డిక్టేటర్’ సినిమా ఆడియో వేడుకను ఏపీ రాజధాని అమరవాతిలో నిర్వహించిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ లాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఆడియో వేడుకను అమరావతిలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారట. సో ఈ వేడుక జరిపేందుకు అప్పుడే ఏర్పాట్లు మొదలు పెట్టారట.
నిజానికి పవన్ కళ్యాణ్ తన సినిమా ఆడియో ఫంక్షన్లను పెద్దగా చేయడానికి ఇష్టపడరు. కానీ ఈ సారి మాత్రం ఆడియో వేడుక జరిపేందుకు చూస్తున్నాడట. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా హీరోలంతా రాబోతున్నారట. ఐతే ఈ సినిమా ఆడియో వేడుకని మార్చ్ 12న పెద్ద ఎత్తున చేయాడానికి చూస్తున్నారట.
ఇంక ఈ సినిమా ఆడియో విడుదల డేట్‍ను అధికరికంగా ప్రకటించలేదు. త్వరలోనే ఆడియో ఎప్పుడు రిలీజ్ చేయనున్నారో తెలుపుతారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరికి వచ్చింది. పవన్ సరసన హీరోయిన్‍గా కాజల్ నటిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సాంగ్స్ కూడా సినిమాకు హైలేట్ అవుతాయట.