టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని ప్రతి ఒక్క డైరెక్టర్ ఎదురు చూస్తుంటాడు. దర్శకుడు దాసరి నారాయణ రావు పవన్‌తో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు అప్పట్లో వచ్చిన విషయం తెలిసిందే. కాకపోతే ఈ సినిమాకి దాసరి నారాయణ రావు కేవలం నిర్మాణానికే పరిమితమై వేరే దర్శకుడితో తీయాలని నిర్ణయించుకున్నారు.
గోపాలా గోపాలా సినిమా తీసిన దర్శకుడు డాలీ కూడా పవన్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఇక నందమూరి బాలకృష్ణ తో లయన్ చిత్రాన్ని తెరకెక్కించిన సత్యదేవ.. రీసెంట్ గా ఓ అద్భుతమైన కథను దాసరికి వినిపించడట. త్వరలోనే ఈ కథను పవన్ దగ్గరకు తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది.
దాదాపు ఈ కథను కన్ఫాం చేయ్యానున్నారు అని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి డీటైల్స్ ప్రకటించనున్నారు. ఇక ప్రస్తుతం సర్దర్ గబ్బర్ సింగ్ సినిమా షుటింగ్‌లో పవన్ బిజీగా ఉన్నాడు. ఈ సమ్మర్లో వస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తుండగా బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.