Thursday, May 2, 2024
- Advertisement -

శేఖర్ మాస్టర్, రష్మీ రొమాన్స్ వెండితెరపైకి..?

- Advertisement -

ఢీ ద్వారా పరిచయం అయిన కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్.. ఆ తర్వాత టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్ గా దూసుకెళ్తున్నారు. అతి తక్కువ టైంలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరితో కొరియోగ్రాఫీ చేసే ఛాన్స్ ను దక్కించుకున్నాడు శేఖర్ మాస్టర్. మెగా హీరోలందరికి ఇప్పుడు డాన్స్ అంటే మొదటి ఛాయిస్ శేఖర్ మాస్టారే.

ఓ విధంగా చెప్పాలంటే లారెన్స్ తర్వాత ఆ స్థాయిలో టాలీవుడ్ లో తన హవాని కొనసాగితున్నాడు శేఖర్. ఇది ఇలా ఉంటే ఇప్పుడు వాళ్ళ దారిలోనే శేఖర్ మాస్టర్ హీరోగా టర్న్ తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వస్తోంది. కొంత మంది డైరెక్టర్లు శేఖర్ మాస్టర్ తో డాన్స్ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక శేఖర్ మాస్టర్ కి జోడిగా హాట్ యాంకర్ రష్మీని హీరోయిన్ గా చేయించాలని చూస్తున్నారట.

ఇక ఢీ షోలో స్టేజి మీద రొమాన్స్ చేసే వీళ్లిద్దరు వెండితెరపై రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని వారిని అభిమానించే అభిమానులు కోరుకుంటున్నారు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది వీరి కాంబోలో సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -