Thursday, April 18, 2024
- Advertisement -

సుధీర్ సినిమాకి రష్మీ నో చెప్పడానికి కారణం ఇదే..!

- Advertisement -

జబర్దస్త్ ద్వారా రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్ బాగా పాపులర్ అయ్యారు. వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరు కలిసి నటిస్తే చూడాల్ని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అయితే సుధీర్ హీరోగా చేసిన సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాలో రష్మీకి ఛాన్స్ వచ్చింది. కానీ డేట్లు లేకపోవడం వల్ల ఈ సినిమాకి రష్మి నో చెప్పిందని సుధీర్ చెప్పాడు. అయితే రష్మి ఈ సినిమాకు నో చెప్పడంపై ప్రముఖ దర్శకుడు ఇమంది రామారావు షాకింగ్ కామెంట్స్ చేశారు.

“ఇక్కడ నేను నిజాలే చెబుతాను. ఈ మూవీ కోసం రష్మీ రూ.40 లక్షలు అడిగారు. కానీ యూనిట్ 35 లక్షలు ఇస్తామని అన్నారు. రష్మి ఒప్పుకోలేదు. రష్మీ ఒకేవేళ ఒప్పుకుని ఉంటే వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి క్రేజ్ ఉంది కాబట్టి సినిమా సూపర్ హిట్ అయ్యి ఉండేది. ప్రతీ ఆర్టిస్ట్ జీవితంలో ఓ చేంజ్ ఓవర్ అనేది ఉండాలి. ఇప్పటివరకు రష్మీ చేసిన ఏ సినిమా సక్సెస్ కాలేదు. ఎందుకంటే రష్మీలోని గ్లామర్‌ను చూపించడానికి అందరూ ఆమెను వాడుకున్నారు కానీ గ్రామర్‌ను చూసేందుకు ఎవ్వరూ ప్రయత్నించలేదు.

ఒకవేళ ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాలో రష్మి హీరోయిన్‌గా చేసి ఉంటే మరో సినిమాలో కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తామనేవాళ్లేమో. రష్మికి, సుధీర్‌కి బాగా సింక్ అయింది. వీరి కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు చాలా ఇష్టం. ఆ రకంగా చూసుకుంటే ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాకు రష్మి నో చెప్పి చాలా పెద్ద పొరపాటు చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ కి మంచి స్కోప్ ఉంది. అది రష్మీ మిస్ చేసుకుంది” అని వెల్లడించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -