Wednesday, May 7, 2025
- Advertisement -

నెలకో సినిమా…ఇదే శ్రీలీల టార్గెట్!

- Advertisement -

నిర్మాతల పాలిట కల్పవృక్షంలా మారింది తెలుగు హీరోయిన్ శ్రీలీల. అగ్రహీరోల దగ్గరి నుండి కుర్ర హీరోల వరకు అందరి ఛాయిస్‌ శ్రీలీలనే. పెళ్లిసందDతో మొదలైన శ్రీలీల మేనియా లేటెస్ట్‌గా గుంటూరు కారం వరకు ఆగడం లేదు. అందం,అభినయం, ఇందుకు తగ్గట్టుగా నటన,ఆ నటనకు తోడు డ్యాన్స్‌, ఇలా ప్రతి ఒక్కటి కలిసి రావడంతో మరికొంతకాలం శ్రీలీల జోష్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

గత ఐదు నెలలుగా శ్రీలీల వరుసగా నెలకొక సినిమా రిలీజ్ ఉండేలా ప్లాన్ చేస్తోంది. స్కంద,భగవంత్ కేసరి,ఆదికేశవ,ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్. సంక్రాంతి రేసులో గుంటూరు కారం ఇలా హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా మరిన్ని సినిమాలను లైన్‌లో పెట్టేసింది శ్రీలీల.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో సినిమాతో పాటు పవన్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తోంది. మొత్తంగా తన కెరీర్‌ సక్సెస్‌ ఫుల్‌గా కొనసాగుతుండగానే అగ్రహీరోయిన్‌ హోదా దక్కించుకుని మరిన్ని సినిమాలతో అలరించేందకు సిద్ధమవుతోంది శ్రీలీల.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -