కొన్ని రోజుల పాటు ఒక వర్గం మీడియా ఛానల్స్‌లో వరుసగా కనిపిస్తూ రచ్చ రచ్చ చేసింది శ్రీరెడ్డి. ఆ ఛానల్స్ అన్నీ కూడా రచ్చను తారాస్థాయికి తీసుకెళ్ళి…. ప్రజలందరి చూపు ఈ రచ్చవైపు మళ్ళాక లక్ష్యంగా చేసుకున్న అసలు వ్యక్తిని…..అతని వ్యక్తిత్వాన్ని హరించే పని పెట్టుకున్నాయి. అయితే టిడిపి జనాలు, ఆ వర్గం మీడియా జనాలెవ్వరూ ఊహించని రీతిలో పవన్ కళ్యాణ్ ఎదురుదాడికి దిగాడు. మామూలుగా అయితే సినిమా జనాలు, నాయకులతో పాటు సొసైటీలో ఉన్న చాలా రంగాల వారు డైరెక్ట్‌గా మీడియాపైన ఎటాక్ చేయడానికి సంకోచిస్తారు. ఎందుకంటే ఆ తర్వాత నుంచీ ఆ మీడియా జనాలందరూ అదిపనిగా వాళ్ళ తప్పులు వెతికి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారన్న భయం. అయితే పవన్ మాత్రం తెగించేశాడు. చంద్రబాబు, లోకేష్‌లు ఎబిఎన్, టివి9, మహాటీవీలను అడ్డుపెట్టుకుని ఆడిన డ్రామాలు, పన్నిన కుట్రలను బయటపెట్టేశాడు. ఆ దెబ్బతో ఇప్పుడు అసలు నిజాలన్నీ బయటకు వస్తున్నాయి.
శ్రీరెడ్డి లీక్స్ వ్యవహారంలో ప్రముఖ పాత్ర పోషించిన ముమ్మూర్తులా బ్లాక్ మెయిలింగ్ జర్నలిజానికి అలవాటుపాడిన ఒక న్యూస్ రీడర్ కం జర్నలిస్ట్ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. ఒక ప్రముఖ సినిమా దర్శకుడికి సంబంధించి శ్రీరెడ్డి దగ్గర ఉన్న వీడియోను అడ్డుపెట్టుకుని ఆ దర్శకుడిని సదరు ఛానల్, జర్నలిస్ట్ బ్లాక్ మెయిల్ చేశాడు. మొత్తంగా బేరం 80లక్షల దగ్గర సెటిల్ అయిందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయాలు మీడియా సర్కిల్స్‌లోనూ, ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యాయి. ఒక్క సెటిల్‌మెంట్‌కే 80లక్షలు గుంజారంటే అసలు ఆ మూడు ఛానల్స్ జనాలు తమ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలతో ఏ రేంజ్‌లో బ్లాక్ మనీ సంపాదించి ఉంటారో అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆ మూడు ఛానల్స్ పుణ్యమాని తెలుగు జర్నలిజం, జర్నలిస్టులపైన ఉన్న గౌరవం పూర్తిగా పోయి……జర్నలిస్టులను బ్లాక్ మెయిలర్స్‌గా జనాలు చూసే రోజులు దాపురించాయని సీనియర్ సంపాదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.