Thursday, March 28, 2024
- Advertisement -

హీరోయిన్స్ కి డబ్బు ఉన్నవాళ్లే కావాలి : శ్రీరెడ్డి

- Advertisement -

శ్రీరెడ్డీ సోషల్ మీడియాలో తనకు నచ్చినట్లు కామెంట్స్ చేస్తూ ఎప్పుడు ఏదో ఒక విధంగా రచ్చ చేస్తూనే ఉంటుంది. హీరోయిన్స్ పై కూడా విరుచుకుపడుతుంది. ఈ తరం హీరోయిన్లు డబ్బు ఉన్నోళ్లనే పెళ్లి చేసుకుంటారని తన ఫేస్ బుక్ లో కామెంట్స్ చేసింది. వాళ్లు స్వార్దపూరిత ధోరణితో ఆలోచిస్తున్నారని కామెంట్స్ చేసింది. కాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ బడా దర్శకనిర్మాతలను టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. ఎంతంటి రచ్చ చేసిందో అందరికి తెలిసిందే.

నిర్మాత సురేష్ బాబు కొడుకు తనను లైగికంగా వాడుకొని వదిలేశాడని ధర్నా కూడా చేసింది. ఆ తర్వాత హైదరబాద్ నుంచి చెన్నై వెళ్లి అక్కడ సెటిలైంది. ఇక సోషల్ మీడియాను వాడుకుని హీరోహీరోయిన్లపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్లందరిపై కామెంట్ చేసి మరోసారి జనం నోళ్ళలో నానుతోంది శ్రీ రెడ్డి. 99 శాతం మంది హీరోయిన్లు డబ్బు ఉన్నవాళ్ళనే పెళ్లి చేసుకుంటారని.. కానీ వారి సినిమాలు చూసేందుకు, టికెట్స్ కొనేందుకు మాత్రం పేద అబ్బాయిలే కావాలంటూ పోస్ట్ పెట్టింది.

అలాంటి హీరోయిన్లను స్ఫూర్తిగా తీసుకొనే సాధారణ మహిళలు కూడా చెడిపోతున్నారు.. ప్రతీ ఒక్కరికీ డబ్బున్న మొగుళ్లే కావాలి, డబ్బులేని వారు చచ్చిపోతున్నారంటూ మరో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. ఈ పోస్టులపై నెటిజన్స్.. నువ్వు మాత్రం పేదవాడిని పెళ్లి చేసుకుంటావా? అని శ్రీరెడ్డిని ప్రశ్నిస్తూ మడిపడుతున్నారు. మరికొందరు శ్రీరెడ్డి చెప్పింది కూడా నిజమే కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -