Sunday, May 12, 2024
- Advertisement -

జగపతిబాబును కాపీ కొడతున్న హీరో

- Advertisement -
Srikanth Vilan Role In Boyapati Srinu Next Movie with Bellamkonda Sreenivas

హీరోలను విలన్స్ గా మారుస్తున్నాడు బోయపాటి. లెజెండ్ సినిమాలో జగపతి బాబుని విలన్ గా మార్చి సక్సెస్ అయ్యాడు బోయపాటి. అది జగపతి బాబు కెరీర్ కి బాగా ప్లస్ అయ్యింది. సరైనోడు కీ అదే సెమ్ సీన్ రిపీట్ చేశాడు. తమిళంలో హీరో ఆది పినిశెట్టిని యంగ్ విలన్ గా మరచాడు.

ఎప్పుడైతే ఆది లాంటి హీరో విలన్ అయ్యాడో ఆ సినిమా అవుట్ లుక్ మొత్తం మారింది. ఇప్పుడు తన కొత్త సినిమాకి ఇదే ఫార్ములాని పాటిస్తున్నాడు బోయపాటి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమాని తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ పాత్రకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందట. ఆ పాత్రకోసం ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాడు బోయపాటి. అర్జున్, శరత్ కుమార్ లాంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. శ్రీకాంత్ ని విలన్ గా మారిస్తే ఎలా ఉంటుందా? అని ఆలోచనలోనూ ఉన్నట్లు సమాచారం. స‌రైనోడులో శ్రీ‌కాంత్ ఓ కీ రోల్ చేశాడు.

త‌న‌కీ.. విల‌న్ పాత్ర‌లు చేయాల‌ని ఉంద‌ని ఈమ‌ధ్య స్టేట్ మెంట్ ఇచ్చాడు. దాంతో పాటు గ‌డ్డం పెంచి లుక్ మారుస్తున్నాడు. సో… శ్రీ‌కాంత్ అయితే విల‌న్ పాత్ర‌కు ఎలా ఉంటుందా? అని బోయ‌పాటి శ్రీ‌ను ఆలోచిస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -