Saturday, April 27, 2024
- Advertisement -

మహేశ్ బాబు త్రివిక్రమ్ సినిమా టైటిల్ అదేనా..?

- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన 28వ సినిమాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో #SSMB28 చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియెషన్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తుంది. దాదాపుగా 13 ఏళ్ల తరువాత మహేశ్ త్రివిక్రమ్ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో సూపర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రధానమైన కథానాయికగా పూజ హెగ్డే, రెండో కథానాయికగా శ్రీలీల అలరించనున్నారు.

Also Read: టాలీవుడ్‍లో సీత పాత్రలో ఎంత మంది నటించారో తెలుసా?

వచ్చే సంక్రాంతికి విడుదలకు సిద్దమౌతున్న సినిమా టైటిల్ కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే త్రివిక్రమ్ తన సినిమాలకు ” ఆ ” సెంటిమెంట్ ఉండడంతో ‘అమరావతికి అటు ఇటు’ టైటిల్ ఎక్కువగా ఫిల్మ్ సర్కిల్స్ వినిపిస్తోంది. ఈ టైటిల్ పైనే మహేశ్ బాబు కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ ఇదే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నాడని చెబుతున్నారు. మరి ఇదే టైటిల్ కి ఫిక్స్ అవుతారో .. మరో టైటిల్ కి వెళతారో చూడాలి. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. త్రివిక్రమ్ – మహేశ్ బాబు కాంబినేషన్లో రానున్న ఈ మూడో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -