Friday, May 9, 2025
- Advertisement -

విజయ్ దేవరకొండ తో సుకుమార్ లవ్ స్టోరీ

- Advertisement -

విజయ్ దేవరకొండ ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో అందరూ దర్శకులు పని చేయాలి అని అనుకుంటున్నా హీరో. ఇప్పటికే సక్సెస్ తో దూసుకుపోతున్న ఈ హీరో త్వరలో డియర్ కామ్రేడ్ అనే సినిమా తో మన ముందుకు రానున్నాడు. ఈ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ దర్సకత్వం లో ఒక సినిమా, ఆ తర్వాత హీరో అని తెలుగు-తమిళ భాషల్లో ఒక సినిమా చేయనున్నాడు విజయ్. అయితే త్వరలో ఒక స్టార్ దర్శకుడి తో పని చేయాలనీ విజయ్ భావిస్తున్నాడట. ఇదే అదను గా చూసుకొని సుకుమార్ విజయ్ ని అప్రోచ్ అయ్యాడట.

నిజానికి సుకుమార్ మహేష్ బాబు తో ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ అది క్యాన్సిల్ అయ్యింది. అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో ఒక సినిమా ప్రకటించారు కానీ అది రావడానికి ఇంకా సమయం ఉంది. సో ఈ ఏడాది ఎలాగో సుకుమార్ ఖాళీ గా ఉండాల్సిన పరిస్థితి. అందుకని సుకుమార్ విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయాలనీ అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ సినిమా త్వరగా మొదలు పెడితే ఇద్దరికీ మంచిది అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -