Thursday, May 8, 2025
- Advertisement -

దేవి ఆశలపై నీళ్లు చల్లిన సుక్కు!

- Advertisement -

ఎన్టీఆర్ హీరోగా రకుల్ హిరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకేక్కిన చిత్రం నాన్నకు ప్రేమతో.ఈ సినిమా హిట్ అవ్వడంతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు సుకుమార్. ఐతే టాప్ హీరోలందరు ఇప్పుడు సుక్కుతో సినిమా చేయడానికి ముందుకు వస్తున్నారు. ఐతే ఇప్పుడు తన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనే విషయంపై సినీ పరిశ్రమలో ఆసక్తి నెలకింది.

ఐతే తాజా రామ్ చరణ్ తో సుక్కు సినిమా ఉంటుందని కొన్ని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఐతే సుకుమార్ మాత్రం  రామ్ చరణ్ తో కానీ, బన్నీతో కాని నా తదుపరి చిత్రం ఉంటుందని తెలిపాడు. నాన్నకు ప్రేమతో సినిమా పాజిటావ్ టాక్ సొంతం చేసుకొని 50 కోట్ల క్లాబ్ లో కూడా చేరింది. సుక్కుతో ఇప్పుడు సినిమా చేయడానికి  రామ్ చరణ్, బన్నీ, మహేష్, అఖిల్ ఇలా టాప్ హీరోలందరు చూస్తున్నారట.

ఐతే దిల్ రాజు నిర్మాణంలో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా వచ్చే సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తాడు అని చాలనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సుక్కు మాత్రం చెర్రి లేద బన్నీ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో నా తదుపరి సినిమా ఉంటుందని చెప్పి దేవికి పెద్ద షాక్ ఇచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -