బాలీవుడ్ హాట్ బ్యూటీ, మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్‌కు.. వయస్స్ఉ పెరుగుతున్న క్రేజ్, డిమాండ్ మాత్రం అసలు తగ్గడం లేదు. సినిమాల పరంగా పెద్ద సక్సెస్ లేకపోయినా.. ఐటెం సాంగ్‌లతో సన్నీ దుమ్ము లేపింది. సన్నీకి వచ్చే చాన్స్‌లు మరొకరికి వెళ్లే అవకాశం లేదు.
అంతేకాదు వేరొకరికి వచ్చే చాన్సులు కుడా సన్నీ లియోన్ దక్కించుకుంటోంది. గూగుల్ సెర్చింగ్ లిస్టులో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమానమైన క్రేజ్ దక్కించుకున్న ఈ హాట్ భామ తాజాగా తన రేటు పెంచేసింది. ఆమె రేటు చూసి బాలీవుడ్ స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు సైతం షాక్ అవుతున్నారన్న గుసగుసలు బాలీవుడ్ లో జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఓ పాప్ సింగర్ ఇండియాలో ఇవ్వబోయే మ్యూజిక్ షో లో స్టెప్పులేయడానికి సన్నీ షాకింగ్ రేటు డిమాండ్ చేసిందట.
ఈ షోలో బాలీవుడ్ స్టార్స్ అలియాభట్, వరుణ్ థావన్, సిద్ధార్త్ మల్హోత్రా వంటి అప్‌కమింగ్ స్టార్స్ ఉన్నా సన్నీకి భారీ మొత్తం ఇప్పించి మరీ ఆమెను షోకు తీసుకొస్తున్నారంటే సన్నీ క్రేజ్ ఎలా ఉందో తెలుస్తోంది. ఈ వేడుకలో ఏకంగా కోటిన్నరకు పైగా డిమాండ్ చేసిందట. సన్నీ రేటు చూసి యావత్ బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు సైతం షాక్ అవుతున్నారట.
{youtube}VQx8Zf7NP8w{/youtube}
Related