స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్ర లో తమిళ దర్శకుడు లింగుస్వామి ఒక పవర్ఫుల్ సినిమా ని చేయాలని అనుకున్నారు. ఈ సినిమా తో బన్నీ ని తమిళం లో పరిచయం చేయాలనే ప్లాన్ వేశారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద జ్ఞానవేల్ రాజా నిర్మాణం లో ఈ సినిమా ప్రకటన వెలువడిన విషయం మనకి తెలిసిందే. అయితే ఈ సినిమా పైన ఇప్పటి వరకు రెండో ప్రకటన ఏమి రాలేదు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా మీద ఒక కొత్త డెవలప్మెంట్ వచ్చింది.
అందరూ అనుకున్నట్టు ఈ సినిమా జరుగుతుంది కానీ బన్నీ ప్లేస్ లో ఒక యువ హీరో ఈ సినిమా లో నటించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. అయితే జీనియస్ సినిమా తో అందరికీ నోటెడ్ అయినా కోనేరు హవీష్ ని ఈ సినిమా లో హీరో గా నిర్ణయించినట్లు టాక్ నడుస్తుంది. ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో రూపు దిద్దుకొని అవకాశం ఉందని సమాచారం.
ఇప్పటి వరకు సినిమా గురించిన వివరాలు ఏవి సరిగా అందుబాటు లోకి రాలేదు కానీ బన్నీ మాత్రం ఈ సినిమా చేయడం లేదు అనే గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి.