ప్రస్తుతం యువతారలు లాక్‌డౌన్ కావడంతో తమ అందాలతో ఫ్యాన్స్ కు ఝలక్ ఇస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్, దిశా పటానీలు హాట్ హాట్ ఫోటోలు, వీడియోలతో ఆకట్టుకొంటున్న విషయం తెలిసింది. తాజాగా వీళ్ల వరుసలో తేజస్వి మదివాడ చేరిపోయింది. ఇటీవలే ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. హీరోయిన్‌గా తేజస్వి చాలా సినిమాలే చేసింది. హీరోయిన్‌గా ముంబై తారల పోటీని తట్టుకోలేక చతికిలపడింది. ఆ తర్వాత బిగ్‌బాస్‌లోకి అడుగు పెట్టింది. బిగ్‌బాస్‌లోను అందాలను ఆరబోసింది. బిగ్‌బాస్‌లోకి వెళ్లాక బుల్లితెర ప్రేక్షకులను బానే అలరించింది. అయితే కొన్ని అనవసర తప్పిదాలతో ప్రేక్షకుల ఆగ్రహానికి గురై షో నుంచి తప్పుకొన్నది. అయితే బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆమె కొన్ని వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. అయితే వాటి నుంచి తొందరగానే బయటపడటం గమనార్హం. బిగ్ బాస్ తర్వాత ఈమెకు మళ్లీ అవకాశాలు వస్తాయి అని అందరు అనుకున్నారు.
కానీ పెద్దగా ఆఫర్లు ఏం రాలేదు. దాంతో ప్రస్తుతం బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు తేజస్వి మదివాడ. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌లో గృహ నిర్బంధంలో ఉన్న తేజస్వి ఇలా హాట్ ఫోటోలతో దర్శనమిచ్చింది. ఈ ఫోటోలు తేజస్విని మరింత గ్లామర్ గా చూపించాయి. ప్రస్తుతం తేజస్వి గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి లాక్ డౌన్ తర్వాత అయినా తేజస్వికి వరుస అవకాశాలు వస్తాయేమో చూడాలి.