Saturday, April 27, 2024
- Advertisement -

నటి సీత ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా ?

- Advertisement -

ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన “గంగోత్రి” సినిమాలో హీరో అల్లు అర్జున్ కు తల్లిగా నటించి ప్రేక్షకులను అలరిచింది సీనియర్ హీరోయిన్ మరియు నటి సీత. ఈమె అప్పట్లో హీరోయిన్ గా సీనియర్ హీరోల సరసన నటించింది. ప్రస్తుతం వయసు మీద పడటం తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు మాత్రమే చేస్తోంది.

అయితే తెలుగులో 1986 సంవత్సరంలో “ఆడదే ఆధారం” అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది సీత. దాంతో తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, తదితర భాషలలో నటించి తనకంటూ స్పెషక్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మొదట్లో సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొంతకాలం తర్వాత పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ రంగంలో కీలక బాధ్యతలు చేపట్టిన మరో వ్యక్తిని సీత పెళ్లి చేసుకుంది.

ఇటీవలే తన పెద్ద కూతురు పెళ్ళిని కూడా ఘనంగా చేసింది. అయితే ఒకప్పుడు తన సినిమాలతో హీరోయిన్ గా ఆకట్టుకున్న సీత ప్రస్తుతం సినిమా ఛాన్సులు లేక ఇంటి పట్టునే ఖాళీగా ఉంటుంది. అయితే చివరిగా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “రభస” అనే చిత్రంలో హీరోయిన్ తల్లి పాత్రలో నటించింది. ప్రస్తుతం నటి సీత తన కుటుంబ సభ్యులతో కలిసి కర్నాటకలోని బెంగళూరులో ఉన్నట్లు తెలుస్తోంది.

౩౦౦కోట్ల బడ్జెట్ లో సంగం ప్రభాస్ కే, అమితాబ్, దీపికాకే..!

టైం అడిగిన క్రిష్.. వేరే సినిమా కు వెళ్ళిన పవన్..?

నాగ్ ని బిట్టు అని ఎందుకు పిలిచానంటే.. : సుజాత

రాధే శ్యామ్ లో ఇంకో హీరోయిన్ ఉందా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -