Wednesday, May 15, 2024
- Advertisement -

మళ్లీ అడ్డంగా కాపీ కొట్టి దొరికిన తమన్..!

- Advertisement -

టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కూడా తమన్ ఆగ్ర మ్యూజిక్ దర్శకుడిగా కొనసాగుతున్నారు. తెలుగులోకి వస్తే ఏ స్టార్ హీరో సినిమా వస్తున్నా ఆ సినిమాకి తమన్ ను మొదటి ఛాన్స్ గా మారాడు. సో తమన్ బాణీలు యూత్ ను ఆకట్టుకునేలా ఉంటాయి. అయితే కిక్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన తమన్ మొదటి సినిమాతోనే సూపర్ ఆల్బమ్ ఇచ్చాడు. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం తమన్ కి రాలేదు.

మ్యూజిక్ దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి తక్కువ కాలం అయినప్పటికి ఎక్కువ సినిమాలు చేసి తన సత్తా చూపాడు. ఆగ్ర హీరోలే కాదు యంగ్ హీరోల సినిమాలకు, హర్రర్ సినిమాలకు ఇలా ఏ సినిమాకైన తనధైన శైలీలో మ్యూజిక్ ఇవ్వగలను అని నిరూపించుకున్నాడు. తమన్ ప్రస్తుతం ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు వర్క్ చేస్తున్నారు. అదే అల వైకుంఠపురములో సినిమా. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, పూజా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇటివలే ఈ సినిమా నుంచి రెండో పాట ను రిలీజ్ చేశారు. ’రాములో.. రాములా’ అనే ఈ సాంఘ్ మాస్ జనాలను ఆకట్టుకుంటుంది. అయితే ఈ పాట వింటుంటే మనకు ఓ ప్రైవేటు ఆల్బమ్ నుంచి ఎత్తుకొచ్చినట్లు కనిపిస్తోంది. ’రాములో.. ఓ రాములా’ అంటూ తన ప్రియుడిపై ఇష్టంను తెలుపుతూ ఓ ప్రేయసి పాడుకునే ప్రైవేటు గీతం ఇది.

తమన్ పాట, ఈ ప్రైవేట్ సాంగ్ ఒకేసారి వింటే కచ్చితంగా పోలికలు కనిపిస్తాయి. దాంతో తమన్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. రెండు పాటలను మిక్స్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అయితే గతంలో కూడా ఇలానే కాపీ కొట్టి చాలా సార్లు తమన్ దొరికిపోయాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -