Monday, May 5, 2025
- Advertisement -

పవన్ చేయబోయే చివరి సినిమా అదేనా..?

- Advertisement -
the last movie pawan with that director

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజ‌కీయాల్లోకి రావ‌డం అనేది క‌న్ఫ‌ర్మ్ అయ్యింది. 2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు దాదాపు యేడాది ముందు నుంచే పవన్ కార్య‌చ‌ర‌ణ‌లోకి దిగుతాడు.

ఈలోగానే పవన్ ఒప్పుకున్న మూడు చిత్రాల షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. అయితే ఇప్పుడు అందరిలో ఒకటే ఆలోచన.. పవన్ లాస్ట్ మూవీ సినిమా ఏంటి..? ప్రస్తుతం పవన్ మూడు చిత్రాలకు ఓకే చెప్పాడు. వీర‌మ్ రీమేక్ సినిమా కాట‌మ‌రాయుడు షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు పవన్. ఈ సినిమా వ‌చ్చే ఉగాదికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, ఆర్‌.టీ.నీశ‌న్ సినిమాలు లైన్లో ఉన్నాయి.

వీటిలో త్రివిక్ర‌మ్ చిత్రమే ముందుగా మొదలు కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా కీర్తిసురేష్, అను ఎమ్మాన్యువ‌ల్ ఎంపిక‌య్యారు. ఖుష్బూ, మోహ‌న్ లాల్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నారు. ఇక త్రివిక్ర‌మ్ ప్రాజెక్టు అయ్యాక చివ‌రిగా నీశ‌న్ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కుతుంది. సో ఈ లెక్క‌న చూస్తే ప‌వ‌న్ చివ‌రి ప్రాజెక్టు డైరెక్ట‌ర్‌గా నీశ‌న్ మిగ‌ల‌నున్నాడు. ఈ చిత్రంను ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో షూటింగ్ మొదలు పెట్టి 2018 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 2018 త‌ర్వాత ప‌వ‌న్ ఇక‌పై సినిమాల్లో చేయ‌డం క‌ష్ట‌మే ఎందుకంటే అప్ప‌టికి ఎన్నిక‌ల‌కు ఇంకా సంవ‌త్స‌రం టైం మాత్ర‌మే మిగిలి ఉంటుంది.  సో ఈ లెక్క నీశ‌న్ సినిమానే ప‌వ‌న్ చివ‌రి సినిమా అనుకోవ‌చ్చు.

Related

  1. పవన్ పంచెకట్టు వెనక ఉన్న రహస్యం చెప్పారు!
  2. రావు రమేష్, పవన్ కు మధ్య గొడవ
  3. పవన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన చిరు!
  4. పవన్ సరసన యాంకర్ అనసూయ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -