ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజా సాబ్’ చిత్రం ఈ ఏడాది ఆరంభంలో భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే, థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకులను, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులను మెప్పించలేకపోయింది. దర్శకుడు మారుతి మేకింగ్‌పై కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఈ చిత్రం, ఇప్పుడు బుల్లితెరపైకి వచ్చేస్తోంది.
థియేటర్లలో విడుదలైన నాలుగు నెలలకే ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. స్టార్ మా (Star Maa) ఛానెల్ ఈ ఆదివారం, ఏప్రిల్ 26, 2026న సాయంత్రం 5:30 గంటలకు ‘ది రాజా సాబ్’ చిత్రాన్ని టెలికాస్ట్ చేయనుంది.
థియేటర్లలో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా, టీవీలో కుటుంబ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటించగా.. సంజయ్ దత్, జరీనా వహాబ్, బొమ్మన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు.
