Wednesday, May 7, 2025
- Advertisement -

డిసెంబర్..బాక్సాఫీస్ వద్ద యుద్ధమే!

- Advertisement -

నవంబర్ నెలలో బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలేవి లేకపోవడంతో వెలవెలబోయాయి థియేటర్లు. అయితే ఆ లోటును తీర్చేందుకు డిసెంబర్ నెల సిద్ధమైంది. సినీ అభిమానులకు అసలైన కిక్ ఇచ్చే సినిమాలు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. సందీప్ వంగా యానిమల్, ప్రభాస్ సలార్, నాని హాయ్ నాన్న, షారుఖ్ ఖాన్ డంకీ వంటి సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ క్రిస్మస్ కానుగా డిసెంబర్ 22న రిలీజ్ కానుండగా షారుఖ్ ఖాన్ డంకీ సరిగ్గా సలార్‌కు ఒకరోజు ముందుగా అంటే డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. అలాగే యానిమల్‌తో పాటు హాయ్ నాన్న, నితిన్ నితిన్ ఎక్స్‌టార్డినరీ కూడా ఇదే నెలలో రాబోతున్నాయి. దీంతో ఈసారి బాక్సాఫీస్ వార్ ఆసక్తికరంగా సాగనుందడంలో ఎలాంటి సందేహం లేదు.

నాని, నితిన్ సినిమాల థియేట్రికల్ బిజినెస్ విలువ రూ. 80 కోట్ల వరకు ఉండనున్నట్లు ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభాస్ సలార్ మూవీ తెలుగు రాష్ట్రాలలో 170 కోట్ల బిజినెస్ చేయగా మొత్తంగా డిసెంబర్ నెలలో దాదాపు రూ. 1000 నుంచి రూ.1500 కోట్ల బిజినెస్ జరగనుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -