Friday, March 29, 2024
- Advertisement -

చిరు సినిమాపై త్రిష కామెంట్స్..!

- Advertisement -

హీరోయిన్ త్రిష వేగంగా స్టార్ ఇమేజ్ సంపాదించింది. నయనతార కాజల్ తమన్నా సమంత లాంటి హీరోయిన్లలా దీర్ఘ కాలం టాప్ లెవెల్లో త్రిష కొనసాగలేకపోయింది. నామమాత్రంగా ప్రస్తుతం హీరోయిన్ గా కొనసాగుతోంది. . 96 లాంటి ఒకటీ అరా తప్ప గత దశాబ్దంలో త్రిషకు చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు ఏం లేవు. అయినప్పటికి త్రిష ఎక్కడ తగ్గట్లేదు.

అప్పుడప్పడూ మంచి అవకాశాలు వస్తున్నా.. వాటిలో సెలెక్టివ్గా ఎంచుకోవడం కొన్ని సినిమాలు ఓకే చెప్పి తర్వాత పాత్రలు నచ్చలేదని వైదొలగడం త్రిషకు మామూలే. ఒకప్పుడు పెద్దగా డిమాండ్ లేని సమయంలో ఆమెకు రవితేజ సరసన సారొచ్చారు సినిమాలో ఛాన్స్ వచ్చింది. కానీ కానీ ఆ పాత్ర నచ్చక ఆ చిత్రం నుంచి వైదొలగిందామె. దాంతో ఆ పాత్రను రిచా గంగోపాధ్యాయ చేసింది. ఆ తర్వాత కొన్నేళ్ల కిందట విక్రమ్ హీరోగా మొదలైన సామి-2లో ఓ హీరోయిన్ గా త్రిషను తీసుకున్నారు. సామిలో త్రిష చేసిన పాత్రకు కొనసాగింపు పాత్ర అది. కానీ దానికి ప్రాధాన్యం లేదని.. కీర్తి సురేష్కే స్క్రీన్ టైం ఎక్కువ ఉందని సినిమా మొదలయ్యాక తప్పుకుంది త్రిష. ఇప్పుడు తెలుగులో ఏకంగా మెగాస్టార్ చిరంజీవికే త్రిష హ్యాండిచ్చేసింది.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. మరో హీరోయిన్ తో పోలిస్తే తన పాత్ర తక్కువ అని భావించే త్రిష ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. తనకు హామీ ఇచ్చినట్లుగా పాత్ర లేదనే విషయాన్ని త్రిష పరోక్షం గా చెప్పకనే చెప్పింది. ఈ వయసులో కెరీర్ ఇప్పుడున్న దశలో పాత్ర ఎలా ఉన్నా చిరు సినిమాలో త్రిష చేయాలి. కానీ ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుని తన పొగరు తగ్గలేదని మరోసారి చెప్పకనే చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -