Saturday, May 18, 2024
- Advertisement -

ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి గురించి షాకింగ్ నిజాలు..!

- Advertisement -

ప్రస్తుతం అందరి చూపు ఉప్పెన సినిమాపైనే ఉంది. ఈ సినిమా ద్వారా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతుండగా.. ఇక తెలుగులో కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా కూడా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.

ఇక ఈ సినిమా ద్వారా హీరో కంటే హీరోయిన్ ఎక్కువగా హైలైట్ అవుతోంది. ఏం క్యూట్ ఉందిరా హీరోయిన్ అని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. ఆ హీరోయిన్ కు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే.. కృతి శెట్టి వయసు 15 సంవత్సరాలే. బెంగళూరుకు చెందిన కృతి శెట్టి భరతనాట్యం నేర్చుకునే సమయంలో డైరెక్టర్ జై తీర్థ కృతిని యాక్టింగ్ నేర్చుకోమని సలహా ఇచ్చిరట. ఆ తర్వాత సదరమే అనే స్టేజి షోలతో ఒక్కసారిగా కర్ణాటకలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

డైరెక్టర్ సునీల్ కుమార్ దేశాయ్ ‘సరిగమ’ అనే సినిమాతో మొదటిసారిగా తెరంగేట్రం చేసింది కృతి శెట్టి. సగక్కల్ సినిమాతో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. క్రేజ్ సంపాదించుకున్న కృతి శెట్టి అజగర్ సమియిన్ కుతిరయ్, కొండాన్ కొడుతాన్, పందియా నాడు, స్నేహవిన్ కాదలర్కాల్, మాంగ, సెవిల్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈమె అయితే ఉప్పెన సినిమాకి బాగుంటుందని తెలుగులోకి తీసుకొచ్చారట. ఇక ఉప్పెన రిలీజ్ కాకముందే ’18 పేజీస్‌’ అనే మరో చిత్రంలో కృతి శెట్టి మరో అవకాశం దక్కించుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -