వెర్సటైల్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్(Varalaxmi Sarathkumar) ఇప్పుడు దర్శకురాలిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. తన సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి ‘దోస డైరీస్’ బ్యానర్‌పై నిర్మిస్తున్న హై-కాన్సెప్ట్ థ్రిల్లర్ చిత్రం ‘సరస్వతి’లో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ సినిమాపై మంచి క్యూరియాసిటీని రేకెత్తించింది.
తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేశారు. తెల్లని క్రాక్ టెక్స్చర్ బ్యాక్‌డ్రాప్ మధ్య ఎరుపు చీరలో ధైర్యంగా ముందుకు నడుస్తున్న వరలక్ష్మి లుక్ కథలోని బలం, భావోద్వేగ తీవ్రతను సూచిస్తోంది. వెనుక భాగంలో బ్లాక్ అండ్ వైట్ షేడ్స్‌లో కనిపించే సిల్హౌట్స్ కథలోని మిస్టరీ, ఇంటెన్సిటీని హైలైట్ చేస్తున్నాయి. స్ట్రాంగ్ విజువల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది.
ఈ చిత్రంలో జీవా, ప్రకాశ్ రాజ్, నాజర్,ప్రియమణి, రాధిక శరత్ కుమార్ తదితర ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే కిషోర్ కుమార్, శ్రీకాంత్ అయ్యర్, రావు రమేష్, సప్తగిరి, మైమ్ గోపి, హరేష్ పరేడే, తులసి, రఘు బాబు, దేవీ ప్రసాద్, వెంకట్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు కూడా భాగమయ్యారు.
టెక్నికల్‌గా కూడా సినిమా బలంగా నిలుస్తోంది. సంగీత సంచలనం తమన్ సంగీతం అందిస్తుండగా, ఎ.ఎం. ఎడ్విన్ సకే సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. వెంకట్ ఎడిటింగ్, సుధీర్ ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు. షూటింగ్ పూర్తి చేసిన ఈ చిత్రం త్వరలో ప్రమోషన్స్ ప్రారంభించి ప్రేక్షకుల ముందుకు రానుంది.
