Sunday, May 5, 2024
- Advertisement -

వరుణ్ తేజ్ ఒళ్ళు పొగరు

- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్ చేసిన మూడు సినిమాలలో హిట్ కొట్టలేదు కాని హీరోగా ఓకే అనిపించుకున్నాడు. అయితే కెరియర్లో ఒక క్రేజ్ వచ్చాక కాని డిమాండ్ చేయాల్సిన రెమ్యునరేషన్ ను..

అఆలు దిద్దుతున్న టైంలోనే డిమాండ్ చేస్తున్నాడన్న రూమర్లు వస్తున్నాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు. నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిస్టర్ అనే టైటిల్ తో తెరకెక్కించబడే ఈ సినిమా ముహుర్తం కూడా పెట్టేసుకున్నారు.   అయితే ఎలా వచ్చిందో ఏమో కాని వరుణ్ తేజ్ ఈ సినిమాలో నటించాలంటే తనకు 5 కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాడట. పట్టు మని ఓ హిట్ కూడా పడని తన కెరియర్ మొదట్లోనే వరుణ్ ఇలా పారితోషికం అంటూ ప్రాకులాడితే కెరియర్ మీద పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది.

ఇప్పటికే మెగా బ్రదర్స్ లో ఒక్క నాగబాబు మాత్రమే ఎలాంటి క్రేజ్  సంపాదించలేక పోయాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ స్టార్ అవ్వాలంటే ఇలాంటి విషయాల పట్ల కాస్త పట్టు విడుపులు ప్రదర్శించాలి. మిస్టర్ సినిమా ఆగిపోడానికి విసా కారణాలని చిత్ర యూనిట్ చెబుతుంటే.. నిర్మాత, హీరోల మధ్య గొడవలే కారణమంటూ కొందరంటున్నారు. మరి వరుణ్ తేజ్ కెరియర్ తన చేతులతో తానే పాడు చేసుకుంటున్నాడన్నది కొంతమంది టాక్. మరి ఈ విషయం ఎంత తొందరగా ఓ కొలిక్కి వస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -