Monday, May 13, 2024
- Advertisement -

‘ఆ’ ఛాన్స్ ఒస్తేనా .. ఇరగదీస్తా – హీరోయిన్

- Advertisement -

బాలీవుడ్ లో ఎదగాలి అంటే స్టార్ హీరోలతో పరిచయాలు చాలా అవసరం అని తెలుసుకున్న అతికొద్ది మంది హీరోయిన్స్ లో హేట్ స్టోరీ భామ జరైన్ ఖాన్ ఒకరు. సేమ్ టు సేమ్ కత్రినా చెల్లిలా ఉండే జరైన్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఏరికోరి కత్రినాతో గొడవ అయినప్పుడు ఎన్నో ఆడిషన్స్ జరిపి వీర్ సినిమాతో బాలీవుడ్ కి పరిచయం చేశాడు.

కానీ సినిమా ఫ్లాఫ్ అవ్వడంతో పెద్ద ఛాన్సులు దక్కించుకోలేదు అమ్మడు.దాంతో కొన్నాళ్లు హిట్ కోసం ఎదురీదిన అమ్మడు లాస్ట్ ఇయర్ బాలీవుడ్ ఎరోటిక్ సిరీస్ లలో ఒకటైన హేట్ స్టోరీ మూడో భాగంలో అందాల విందు చేసి కుర్రాల్ల మతులుపోగొట్టింది. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో ఇప్పుడు చేతి నిండా ఆఫర్స్ తో దూసుకుపోతున్న అమ్మడు సూపర్ స్టార్ సల్మాన్ తో మరో ఛాన్స్ కావాలి అంటోంది.

నా కెరీర్ అప్పుడు అలా ఉండటానికి ఇప్పుడు ఇలా ఉండటానికి కారణం సల్మాన్ ఖానే అని ఆయనతో మరోసారి నటించడానికి నేను ఉవ్విళ్లూతున్నానని చెబుతుంది. సల్మాన్ కూడా మంచి ఛాన్స్ ఇస్తానని చెప్పడంతో ఆ ఆఫర్ ఎప్పుడు తన తలుపుతడుతుందా అని ఎదురుచూస్తున్నట్లు చెబుతుంది అమ్మడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -