- Advertisement -

త్రిష, నయన్ కలిసి నటిస్తున్నారట

- Advertisement -

ఒక సంవత్సరం అటూ ఇటుగా ఒకే టైమ్ లో ఇండస్ట్రీలోకి వచ్చి.. పదేళ్లకు పైగా స్టార్ హీరోయిన్లుగా కంటిన్యూ అవుతున్నారు.. నయనతార, త్రిష. ఈ ఇద్దరికీ, ఒకరంటే ఒకరికి బయటికి కనిపించని కోపం.

తమ కెరీర్ కు ఒకరంటే ఒకరు అడ్డుగా ఉన్నారన్న భావనతో.. ఇద్దరూ కలిసి కనిపించడం కూడా చాలా కష్టంగా మారిన సందర్భాలున్నాయి. అలాంటిది.. ఇప్పుడు నయనతార, త్రిషలను ఒకే స్క్రీన్ పై చూసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోలీవుడ్ లో విజయ్ సేతుపతితో నయన్ నటించిన నానుమ్ రౌడీ దా సినిమా మంచి హిట్ అయ్యింది.

ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో.. విఘ్నేష్ శివన్ డైరెక్షన్ మరో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో.. హీరోయిన్ క్యారెక్టర్ తో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ కు త్రిషను తీసుకోవాలని విఘ్నేష్ ట్రై చేస్తున్నాడు. అన్నీ కుదిరితే.. త్వరలోనే విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో రానున్న విజయ్ సేతుపతి కొత్త సినిమాలో… నయనతార, త్రిష ఇద్దరి అందాలను ఒకేసారి చూసేయొచ్చు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -