Friday, March 29, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌ 4కి హోస్ట్ గా విజయ్ దేవరకొండ..?

- Advertisement -

బిగ్‌బాస్‌ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ షోలో జరిగే గొడవలు.. వివదాలు అన్ని ఇన్ని కావు. ఇప్పటికే తెలుగులో మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. మొదటి బిగ్ బాస్ షోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా.. రెండో సీజన్ కు నాని, మూడో సీజన్ కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌కు రెడీ అవుతోంది.

ఇప్పుడు కరోనా కారణంగా థియేటర్లు మూత పడడం, షూటింగ్స్‌ నిలిచిపోవడం.. తిరిగి ప్రారంభమైన షూటింగ్స్ స్పాట్స్‌లో కరోనా కలకలంతో తెలుగు సినీ, టీవీ పరిశ్రమలకు అడుగడుగునా అడ్డంకులు పడుతున్నాయి. పలువురు బుల్లితెర నటులకు కరోనా సోకడంతో సీరియల్స్‌ షూటింగ్స్‌ కూడా ఆగిపోయేలా ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో బిగ్ బాస్ షో గురించి కొత్త వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు నాలుగో సీజన్‌ హోస్ట్ విషయంలో రోజుకో వార్త వస్తోంది.

మళ్లీ తారక్ వస్తాడు.. లేదు నాగ్‌ కంటిన్యూ చేస్తాడు.. కాదు కాదు ఫస్ట్‌ టైమ్‌ లేడీ హోస్ట్‌గా సమంత తెరపైకి వస్తోందంటూ వార్తలు వినిపించాయి. ఈ లిస్ట్‌లో ఇప్పుడు సెన్సేషనల్‌ స్టార్ విజయ్ దేవరకొండ పేరు చేరింది. ఉన్నదున్నట్టు బయటికి మాట్లాడే విజయ్‌ని హోస్ట్‌గా పెడితే యూత్‌, లేడీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్‌ వస్తుందని, షో కూడా సూపర్ హిట్టవుతుందని నిర్వాహకులు అనుకుంటున్నారట. అదే విషయాన్ని రౌడీ హీరోకి చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. ఎలాగో ఇప్పట్లో సినిమా షూటింగ్స్‌ జరిగేలా లేవు కాబట్టి.. ఈ ఖాళీ టైమ్‌లో బిగ్‌బాస్‌ షూట్‌లో పాల్గొనాలని అతడిని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ విషయంలో విజయ్‌ నుంచి గానీ… బిగ్‌బాస్‌ యూనిట్‌ నుంచి గానీ అధికారికంగా ప్రకటన రాలేదు. విజయ్‌ హోస్టింగ్‌కు ఒప్పుకుంటే మాత్రం బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ ఓ రేంజ్‌లో దూసుకెళ్లడం పక్కాని అందరు అంటున్నారు.

తరుణ్ భాస్కర్ ను ట్రోల్ చేస్తున్న మహేష్ అభిమానులు..!

సురేఖ, హేమ.. తమ కూతుర్ళతో క్యాష్ షోలో రచ్చ..!

11ఏళ్లు చిన్నోడే.. కానీ ఆ పనిలో మాములోడు కాదు : మలైకా

బ్రహ్మానందం సినిమాలకు గుడ్‌ బై ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -