Saturday, April 20, 2024
- Advertisement -

అమలాపాల్ పెళ్లి తర్వాత అలా చేసింది : విజయ్ తండ్రి

- Advertisement -

నటి అమలాపాల్, దర్శకుడ ఏ.ఎల్ విజయ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకుని తర్వాత విడిపోయారు. ఏడాది కూడా కాపురం చేయకుండానే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. అయితే వీరిద్దరు మనస్పర్థల వల్ల విడిపోయారు అని వార్తలు వచ్చారు. అయితే వీటిపై అమలపాల్ గానీ.. విజయ్ గానీ స్పందించలేదు. విజయ్ తండ్రి అజగప్ప మాత్రం ఇద్దరూ విడిపోవడానికి అసలు కారకురాలు అమలా పాల్ మొండితనమేనని.. ఇచ్చిన మాటను మీరడమేనని ఓ ఇంటర్వూలో వెల్లడించారు.

ప్రేమించుకున్నారని మేము పెళ్లికి ఒప్పుకుని పెళ్లి చేస్తే.. ఆ తర్వాతే అమలాపాల్ అసలు రంగు బయటపడిందని ఆయన అన్నారు. వివాహం తర్వాత సినిమాలు చేయొద్దని అమలపాల్ కి విజయ్ ఫ్యామిలీ చెప్పిందంట. అందుకు అమలపాల్ కూడా ఒప్పుకుంది. కానీ పెళ్లి తర్వాత తమకు తెలియకుండా ఇద్దరు అగ్ర హీరోల చిత్రాలకు సంతకం చేసిందని..ఈ కారణంగా విజయ్ తో విబేధాలు తలెత్తినట్లు తాజాగా విజయ్ తండ్రి మరోసారి వెల్లడించారు. అలాగే అమలాపాల్ తల్లిదండ్రులు ఎంతో మంచివారని ఎంతో చెప్పి చూశారని ఆయన అన్నారు. సినిమాలు మానేయాలని అమల తండ్రి ఎంతో వేడుకున్నారు.

అయినా ఆమె తండ్రి మాటను కూడా పక్కనపెట్టేసింది. తన జీవితం..తన ఇష్టం అన్నట్లే వ్యవరించింది! తప్ప ఇతర మనోభావాల గురించి అస్సలు పట్టించుకోలేదని తెలిపారు. దీంతో విజయ్ జీవితం ఇబ్బందుల్లో పడింది. అమల ఇలానే వ్యవహరిస్తే చాలా సమస్యలు ఎదుర్కుంటుంది. ఏది ఏమైన విజయ్ ఆరోగ్యం.. భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని విడాకుల అనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం విజయ్ చాలా సంతోషంగా ఉన్నాడని…సినిమా జీవితం…ఫ్యామిలీ లైఫ్ రెండూ హ్యాపీగా సాగిపోతున్నాయని…ఇలాంటి ఆడవాళ్ల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే! అంత మంచిదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇక విజయ్ అమలాతో విడిపోయాక ఓ డాక్టర్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -