Sunday, May 19, 2024
- Advertisement -

అర్జున్ రెడ్డిని కాల్ చేసి ఇంటికి పిలిపించుకున్న స్టార్ హీరో విక్రమ్

- Advertisement -

యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా చేసినవి మూడే సినిమాలు.. వాటిలో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి.. తనకంటు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. పెళ్లిచూపులు సినిమాతో ఊహించని రీతిలో విజయ్ దేవరకొండ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇక అర్జున్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి యువత ఫిదా అయింది.

తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో ఈ సినిమాని తమిళంలో కూడా రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిండే. ఈ రీమేక్ లో తమిళ సూపర్ స్టార్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా నటిస్తున్నాడు. ఇది ఇతనికి మొదటి సినిమా. అర్జున్ రెడ్డిలో మెడికోగా విజయ్ దేవరకొండ అత్యంత సహజంగా నటించాడు. దీంతో ఇంప్రెస్ అయిన విక్రమ్.. విజయ్‌కు ఫోన్ చేసి అభినందించాడట. తన కుటుంబ సభ్యులతో కలిసి ఒకరోజు టైం స్పెండ్ చేయమని కూడా రిక్వెస్ట్ చేశాడట.

జాతీయ స్థాయి అవార్డు సాధించిన ప్రముఖ హీరో అలా అడగటంతో విజయ్.. కూడా చెన్నై చెక్కేశాడట. ధ్రువ్, విజయ్ ఇద్దరూ కలిసి అర్జున్ రెడ్డి పాత్ర గురించి చాలా విషయాలు డిస్కస్ చేశారట. విజయ్ దేవరకొండ విక్రమ్ కుమారుడికి కొన్ని టిప్స్ కూడా ఇచ్చాడట. విజయ్ కూడా విక్రమ్ నుంచి ఫిట్‌నెస్ చిట్కాలు పొందాడట. మొత్తానికి అర్జున్ రెడ్డి తమిళంలో కూడా తెరకెక్కడం విజయ్ కి సంతోషాన్ని ఇస్తుందంట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -