లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ వివాదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన సంగతి తెలిసిందే. పృథ్వీ చేసిన కామెంట్స్ లైలా సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తున్న నేపథ్యంలో నష్టం జరగకముందే వివాదానికి పుల్ స్టార్ పెట్టింది చిత్రయూనిట్.
నటుడు విశ్వక్ సేన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ సారీ చెప్పాడు. చాలా కష్టపడి సినిమా తీశాం. ఆ వ్యక్తికి, నాకు ఏ సంబంధం లేదు. సారీ సార్. సినిమాకి సపోర్ట్ చేయండన్నారు. ఒక్కరి తప్పుకి 99 మందిని ఫెయిల్ చేయకండి. బాయికాట్ లైలా అని 25,000 మంది ట్రెండ్ చేశారు అన్నారు.
త్వరలోనే సినిమా హెచ్‌డీ ప్రింట్ రిలీజ్ చేస్తామని చాలా మంది ట్వీట్లు చేస్తున్నారని విశ్వక్ సేన్ ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డామని..అసలు ఆయన అటువంటి కామెంట్స్ చేస్తున్న సమయంలో అక్కడ తాను లేనని, చిరంజీవిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లానని చెప్పాడు. తాను ఇంటికి వెళ్లాక ఈ విషయం గురించి తెలిసిందని చెప్పారు.
లైలా మూవీలో తానును మేకల సత్తి అనే పాత్ర చేశానని తెలిపారు. మూవీ మొదలైనప్పుడు మొత్తం 150 వరకు మేకలు ఉండేవని, అయితే, పూర్తయ్యే నాటికి 11 మేకలు అయ్యాయని చెప్పారు. ఈ విషయం యాదృచ్ఛికమో లేదంటే కాకతాళీయమోనని ఎద్దేవా చేశారు. పొలిటికల్‌గా పృథ్వీ సెటైర్ వేయగా ఇది వివాదానికి కేరాఫ్ గా మారింది.
