Monday, April 29, 2024
- Advertisement -

గామి..వసూళ్ల జోరు

- Advertisement -

గామి నిస్సందేహంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మెచ్చుకోదగ్గ ప్రయత్నమే. దర్శకుడు విద్యాధర్ కాగిత వినూత్నంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా విజువల్ వండర్, కాన్సెప్ట్ అదరహో అనిపించింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి రోజు రూ.9.07 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇండియా మార్కెట్‌లోనే కాదు ఓవర్సీస్‌లోనూ సత్తాచాటింది.

తొలిరోజు యుఎస్‌లో 2 లక్షల 50 వేల డాలర్లను రాబట్టింది. విశ్వక్ సేన్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ దిశగా దూసుకెళ్తుంది. ఇక ఈ వీకెండ్‌లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ చిత్రానికి నరేష్ కుమారన్ సంగీతం అందించగా వి సెల్యులాయిడ్ సమర్పించింది.

మహా శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకురాగా అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద నిలబడింది గామి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -