- Advertisement -
విశ్వక్ సేన్..వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్. ముఖ్యంగా మాస్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న విశ్వక్ సేన్…ఇటీవలె గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో హిట్ కొట్టారు. పక్కా మాస్‌గా అలరించిన విశ్వక్ సేన్ ఈసారి అమ్మాయిగా మారారు.
దర్శకుడు రామ్ నారాయణన్ తెరకెక్కిస్తున్నచిత్రంలో అమ్మాయిగా కనిపించనున్నారు విశ్వక్ సేన్. ఈ సినిమాకు లైలా అనే టైటిల్‌ను ఖరారు చేయగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
ఇందులో విశ్వక్ సేన్ అమ్మాయిగా చాలా అందంగా కనిపిస్తుండగా రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేశారు మేకర్స్. 2025 ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.