Friday, May 17, 2024
- Advertisement -

మెగా హీరోయిన్ అదరగొడుతోంది..!

- Advertisement -

మెగా హీరోయిన్‍ నాగ బాబు కూతురు నిహరిక నటించిన ‘ముద్దపప్పు ఆవకాయ’ సిరీస్‍కు మంచి స్పందన వస్తుంది. ఐతే ఈ సంక్రాంతికి తొలి ఎపిసోడ్ రిలీజ్ కాగా రెండు వారాల గ్యాపుతో రెండో ఎపిసోడ్‍ను విడుదల చేసారు.

ఈ రెండు ఎపిసోడ్స్‌కి మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు వీటికి 15 లక్షలకుపైగా వ్యూస్ వచ్చి యుట్యూబ్‍లో రికార్డ్ సృష్టిస్తున్నాయి. ఐతే తాజాగా  ‘ముద్ద పప్పు ఆవకావయ్’ మూడో ఎపిసోడ్ రిలీజ్ చేసారు. ప్రణీత్ బ్రామందపల్లి దర్శకత్వంలో ఈ  ‘ముద్ద పప్పు ఆవకాయ్’ సిరీస్ తెరకెక్కుతోంది. నిహారిక నటన అందరిని అకట్టుకుంటుంది.

యుట్యూబ్‍లో నిహారిక నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇందులో నిహారికకు జోడిగా ప్రతాప్ నటిస్తున్నాడు. ముద్ద పప్పు ఆవకాయ్ ఎపిసోడ్3 కూడా మంచి స్పందన వస్తుందని అంటున్నారు. ఇక నిహారిక హీరోయిన్‍గా నటిస్తున్న సినిమా విషయానికి వస్తే మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు’ వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు దర్శకత్వంలో ‘ఒక మనసు’ తెరకేక్కుతుంది. ఈ సినిమా ద్వారా నిహారిక హీరోయిన్‍గా పరిచయం అవుతుంది. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాని మధుర శ్రీధర్ నిర్మిస్తున్నారు. 

{youtube}v=NS_Hrf7oNZM{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -