- Advertisement -

Yash:’టాక్సిక్’ విడుదల తేదీ ఖరారు

- Advertisement -

టాక్సిక్ విడుదల తేదీ ఖరారైంది. రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న ఈ భారీ చిత్రం 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.

రేపు (మార్చి 20) ‘టాక్సిక్’ టీజర్ విడుదల కానుంది. ఇప్పటికే పోస్టర్లతో అంచనాలు పెంచిన చిత్రబృందం, టీజర్‌తో సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించనుంది. యశ్ ‘కేజీయఫ్’ సిరీస్ విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

కేజీఎఫ్ చిత్రాల తర్వాత యశ్ చేస్తున్న ఈ సినిమా ప్రత్యేకత సంతరించుకుంది. ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ రూపొందుతోంది. ఆమె శైలిలో యశ్‌ను కొత్త కోణంలో చూపించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. టీజర్ విడుదల తర్వాత సినిమా స్థాయి, కథా నేపథ్యంపై స్పష్టత రానుంది. అభిమానులు మాత్రం మార్చి 19, 2026 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -