- Advertisement -

టాక్సిక్..రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ!

- Advertisement -

శాండల్‌వుడ్ హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన కేజీఎఫ్ ఫ్రాంచైజ్ ద్వారా పాన్-ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా “టాక్సిక్”. గీతు మోహందాస్ దర్శకత్వంలో రూపొందుతోంది.

ఈ చిత్రానికి “A Fairy Tale for Grown Ups” అనే ట్యాగ్‌లైన్ ఉంది. ఇందులో నయనతార మరియు కియారా అద్వానీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
టాక్సిక్ చిత్రం మార్చి 19, 2026న విడుదల కానుందని మేకర్స్ ముందే ప్రకటించారు. అయితే, కొంతకాలంగా యష్‌కి కొన్ని సీన్లు నచ్చలేదనే కారణంగా సినిమా వాయిదా పడే అవకాశం ఉందని పుకార్లు వినిపించాయి.

కానీ ఇప్పుడు మేకర్స్ అధికారికంగా స్పష్టం చేస్తూ, సినిమా ఉగాది సీజన్‌కి ఎలాంటి మార్పు లేకుండా విడుదల అవుతుందని ధృవీకరించారు. ప్రస్తుతం యష్ “రామాయణం” చిత్ర పనుల్లో బిజీగా ఉండగా, టాక్సిక్ టీమ్ పోస్ట్-ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేస్తోంది. రుక్మిణి వసంత్, హూమా ఖురేషీ, మరియు తారా సుటారియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ నారాయణ నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -